బుధవారం పూజలో గజాననుడికి ఇవి సమర్పిస్తే అన్నీ శుభాలే..

హిందూమతంలో బుధవారం నాడు వినాయకుణ్ణి  ప్రార్థిస్తారు.

తలపెట్టిన పనిలో విఘ్నాలు రాకుండా కాపాడుతాడు ఈ విఘ్నేశ్వరుడు.

ఆదిదేవుడిగా పూజలు అందుకున్న గణపయ్యను బుధవారం పూజించడం వల్ల బుధ గ్రహశక్తి బలపడుతుంది.

గణపతికి పూజలో పెట్టవలసిన నైవేధ్యాలు, పదార్థాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పూజ సమయంలో దేవుడి ముందు గరిక పోచలు పెడితే.. గణానాథుడు సంతోషించి ఆశీస్సులు అందిస్తాడు.

గణనాథుడికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం.

పనిలో విజయం సాధించాలంటే గణేషుడికి అరటిపండును నైవేద్యంగా పెట్టండి.

గజాననుడికి ముందు పసుపును ఉంచితే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది.

వినాయకుడి పూజలో తమలపాకునుపెట్టడం ద్వారా ఆ భగవంతుడి దీవెనలు లభిస్తాయి.