ప్రతి ఏటా.. ప్రతి గల్లీలో.. గణేష్ మండపాలలో ఈ పాటలు మోగాల్సిందే..

22 August 2025

Prudvi Battula 

జయ జయ శుభకర వినాయకా అన్నా.. జై జై గణేశ అంటూ గంతులేసినా.. గణపతి బప్పా మోరియా అంటూ మాస్ స్టెప్స్ వేసినా అది తెలుగు ప్రేక్షకులకే దక్కుతుంది

ఈ ఒక్కపాటే కాదు.. తెలుగు సినిమాల్లో వినాయకుని మీద వచ్చిన పాటలన్నీ యమ పాపులార్టీ సంపాదించుకున్నాయి. ప్రతి వినాయక చవితికి ఊరూ వాడల్లో ఈ పాటలు మారుమ్రోగిపోతుంటాయి

మన తెలుగు చిత్రాల్లో గణేషుని మీద ఇప్పటికే చాలా పాటలు వచ్చాయి. డీజే పాటలతో.. వినాయకచవితి స్పెషల్ పాటలతో కుర్రకారు సందడి చేస్తూ ఉంటారు. వీటిలో మోస్ట్‌ పాపులర్‌ సినిమా పాటలు ఇవే

వినాయకచవితి సమయంలో 'వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకరేషు సర్వదా' పాట మోగాల్సిందే. దేవుళ్లు సినిమాలోని ఈ పాటను బాలసుబ్రహ్మణ్యంగారు పాడారు

కూలీ నెం.1 మువీలోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా కరుణించయ్య దేవా, నీ అండ దండ ఉండలయ్యా చూపించయ్య దేవా’ అంటూ సాగే ఈ పాట ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం  పాడారు. గణేష్ నిమజ్జనం సమయంలో వచ్చే పాట ఇది

'జై జై గణేశా జై కొడ్త గణేశా జయములు ఇవ్వు బొజ్జ గణేశా' అని అంటూ సాగే ఈ పాట చిరంజీవి నటించిన జై చిరంజీవ మువీలోది. ఈ పాట కూడా బాలసుబ్రహ్మణ్యం అద్భుత స్వరం నుంచి జాలువారిందే

'వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమ ప్రభ గణపతి బప్పా మోరియా' అంటూ సాగే ఈ పాట ఇద్దరమ్మాయిలతో సినిమాలోనిది. ఇది సాంప్రదాయ పాట కంటే ఆధునిక కాలపు పాటగా చెప్పవచ్చు. ఈ పాటను సూరజ్ జగన్ పాడారు

‘తిరు తిరు గణనాధ ది ది దితై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అంటూ సాగే ఈ పాట 100% లవ్ సినిమాలోనిది. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్​అయ్యే ప్రతి విద్యార్థి పాడుకునే పాట. ఈ పాటలో తమన్నా మెయిన్​ రోల్‌లో కనిపిస్తుంది