కుక్కను పెంచుకుంటే.. రాహు-కేతు దోషం తగ్గుతుందా.? వాస్తవం ఏంటి.? 

25 August 2025

Prudvi Battula 

రాహు-కేతువులు నవగ్రహాలలో ఛాయా గ్రహాలు. వీటి పేరు వింటే చాలు ప్రజలు భయపడిపోతారు. ఎందుకంటే ఈ గ్రహాలు అశుభమైనవిగా పరిగణించబడుతున్నాయి.

తమ జీవితాలను నాశనం చేస్తాయని నమ్మకం. జాతకంలో రాహు-కేతువులకు సంబంధించి ఏదైనా దోషం ఉంటె దోష నివారణ చేయడం ఉత్తమం అని నమ్మకం.

రాహువు ప్రభావం శాంతించటానికి,  కొంతమంది ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. కుక్క నలుపు రంగులో ఉంటే.. అది మరింత మెరుగ్గా పరిగణించబడుతుంది.

నల్ల కుక్క ఇంటి నుండి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది. నల్ల కుక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రజలు చెడు దృష్టి నుంచి బయటపడతారు.

ఇంట్లో కుక్కలను పెంచుకోవడం ద్వారా రాహు-కేతు నక్షత్రాలు శాంతించడంతో పాటు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి.

కుక్కను పెంచుకోవడం సాధ్యం కాకపోతే కుక్కలకు బ్రెడ్ అందించండి. రాహు దోష నివారణకు కుక్కలకు ఆహారం అందించడం,  చేయడం ద్వారా సంతోషిస్తాడు.

ముఖ్యంగా ఎవరి జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉన్నాడో లేదా రాహువు మహాదశ కొనసాగుతున్న వారు ఖచ్చితంగా కుక్కలను పెంచుకోవడంతో పాటు ఆహారం అందించాలి.

కుక్కలను పెంచడం, వాటిని సేవించడం ద్వారా, ప్రజలు రాహు దోషం నుండి బయటపడతారు. జీవితంలో కష్టాల నుండి రక్షించబడతారు. కుక్కకు నూనెతో రోస్ట్ చేసిన బ్రెడ్ తినిపిస్తే బాగుంటుంది.