తాబేలు ఉంగరం ధరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా...?
తాబేలు గుర్తు ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంటే జీవితంలో విజయాన్ని అందుకుంటారు.
తాబేలు ఉంగరాన్ని మనం ఇష్టానుసారంగా పెట్టుకోకూడదు. వాటిని పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు కచ్చితంగా ఉంటాయి.
తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో, చక్కటి మార్పులు చోటు చేసుకుంటాయి.
తాబేలు ఉంగరాన్ని పెట్టుకునేటప్పుడు మధ్య వేలుకి కానీ చూపుడు వెలుగు కానీ పెట్టుకోవాలి. పైగా ఎప్పుడూ కుడి చేతికి మాత్రమే పెట్టుకోవాలి.
తాబేలు ముఖం మనకి ఎదురుగా ఉండాలి. వ్యతిరేక దిశలో ఉండకూడదు.
శుక్రవారం సంపదకి దేవత అయిన లక్ష్మీదేవికి పవిత్రమైన రోజు, ఈ రోజు మాత్రమే తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి.
పంచదాతు, అష్టధాతు,వెండి తాబేలు ఉంగరం పెట్టుకుంటే మంచిది. ఉంగరాన్ని పెట్టుకునే ముందు, ఉంగరాన్ని పచ్చి పాలల్లో నానబెట్టాలి.
తర్వాత లక్ష్మీదేవి చిత్రానికి కానీ విగ్రహానికి కానీ పూజ చేసి, తర్వాత ఉంగరాన్ని పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
పదే పదే ఉంగరాన్ని వేళ్ళ నుంచి తీయకూడదు. ఇలా తాబేలు ఉంగరాన్ని మీరు పెట్టుకుంటే నంపద, శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో కూడా నష్టపోకుండా ఉంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి