దీపారాధన ఉండగా పూజగది తలుపులు వేయోచ్చా.?
ఉదయం వేళలోను సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత, వెంటనే..
పూజ గది తలుపులు వేయవచ్చా..? వేయకూడదా.? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతు ఉంటుంది.
కొందరు దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకూ ఆ తలుపులను తెరిచే ఉంచుతుంటారు.
ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు.
ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించ కూడదని శాస్త్రం చెబుతోంది.
అలాగే దీపారాధన ఉన్నంత వరకూ తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని.
భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి