‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం భారీ వసూళ్లుతో పాటు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కైవసం చేసుకుంది.

కాగా తాజాగా ‘స్పైడర్‌ మ్యాన్‌’ హీరో టామ్‌ హాలండ్‌  ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి ఆయన మాట్లాడారు.

ఇటీవల ముంబయిలో జరిగిన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు టామ్‌ హాలండ్‌.

మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉన్న అయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత్‌ పర్యటన గురించి చెప్పారు.

ఆ సమయంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి కూడా ప్రస్తావించారు స్పైడర్‌ మ్యాన్‌.

‘‘నాకు భారత్‌ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. ఆ పర్యటనను జీవితంలో మర్చిపోలేను. మళ్లీ  భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాను.

మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా గడిచింది.

అలాగే ఈ మధ్యనే నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. నాకెంతో నచ్చింది’’ అంటూ ప్రశంసలు కురిపించారు స్పైడర్‌ మ్యాన్‌.