సోషల్‌ మీడియా వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపేవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆత్మహత్యా ధోరణులు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది

సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్న మొదటి అధ్యయనం ఇది

ఎందుకంటే ఈ అధ్యయనంలో వైద్యులు వారి శరీరంలో ఒక నిర్దిష్ట రకం ప్రోటీన్ ఉన్నట్లు కనుగొన్నారు

ఇది భయంకరమైన సంకేతం ఎందుకంటే ఈ ప్రోటీన్ అధికంగా ఉంటే హృదయ సంబంధ వ్యాధులకు, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుందన్నారు

సోషల్ మీడియా పూర్తిగా చెడ్డది చెప్పడంలేదని కానీ మితిమీరినది ఖచ్చితంగా ప్రమాదకరమని కనుగొన్నారు

సోషల్ మీడియాలో మాత్రమే జీవించే వ్యక్తులు నిజ జీవిత బంధాలను కోల్పోతారని హెచ్చరించారు

సోషల్‌ మీడియాలో ఎక్కువసేపు గడిపితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని తద్వారా రకరకాల రోగాలు చుట్టుముడుతాయని తెలిపారు