ఏసీ ఉండే చాలా హాయిగా ఉంటుంది. కానీ అదే ఏసీతో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ కారణంగా కలిగే ఆరోగ్య సమస్యలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎయిర్ కండీషనర్ గాలి నుంచి అధిక మొత్తంలో తేమను తొలగిస్తుంది.  ఫలితంగా మీరు ఉన్న చోట పోడి గాలి ఏర్పడి, కంటికి చికాకు పెట్టేలా మారుతుంది. ఇంకా మీరు పొడి కళ్లతో ఇబ్బంది పడతారు.

ఉన్న గాలినే పదే పదే సర్క్యూలేట్ అయ్యేలా ఏసీ చేస్తుంది. ఇలా ఎక్కువ సమయం పాటు ఫ్రెష్ ఎయిర్ లేకపోతే మీరు తొందరగా ఆలసిపోయిన అనుభూతి పొందింతారు.

ఇంకా ఏసీ కారణంగా మీ చుట్టూ ఉండే పొడి గాలి మీలో డిహైడ్రేషన్ కలిగేలా చేస్తుంది.

మీరు ఎక్కువ సమయం ఏసీలో ఉండి.. ఆ తర్వాత మళ్ళీ ఎండలోకి వెళ్తే అది చర్మంపై దురదకు దారితీస్తుంది.

ఏసీ కారణంగా మీరు ఎదుర్కొనే డిహైడ్రేషన్ తలనొప్పిగా కూడా మారుతుంది.

ఏసీ నుంచి వచ్చే గాలి మీలో ఆస్తమా, గురక వంటి  శ్వాస సంబంధిత సమస్యలు కలిగేలా కూడా చేస్తుంది.

కాలనుగుణంగా వచ్చిన టెక్నాలజీ కారణంగా ఏసీల నుంచి చాలా వరకు శబ్దం రావడం లేదు. కానీ పాత మోడల్ ఏసీల నుంచి శబ్దం ఎక్కువగా వస్తుంది. అది మీలో వినికిడి సమస్యను కలిగించవచ్చు.

ఏసీ ఉన్న ఇంటికి వెంటిలేషన్ తప్పనిసరి. వెంటిలేషన్ లేకపోతే ఏసీ నుంచి వచ్చే గాలి.. వాతావరణంలోని గాలితో కలిసి మీ ఇంటిలోనే కాలుష్యం ఏర్పడేలా చేస్తుంది.

ఏసీ సిస్టమ్ కారణంగా మీరు ఉండే బిల్డింగ్‌లో వైరస్ లేదా డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది అంటు వ్యాధులుగా పరిణమించవచ్చు.