నివసించడానికి అత్యంత చవకైన ప్రదేశాలలో ఒకటి కోల్‌కతా. ఇక్కడ ఆహారం నుండి ప్రయాణం వరకు ప్రతిదీ చౌకగా ఉంటుంది.

ఇక్కడ బస్సు ప్రయాణానికి ఛార్జీలు కేవలం రూ.7 నుంచి మాత్రమే!

ఆసియాలోని అతిపెద్ద సెకండ్ హ్యాండ్ బుక్ మార్కెట్ చుట్టూ తిరగండి. దీని వల్ల మీకు ఎలాంటి ఖర్చు ఉండదు.

కాలేజ్ స్ట్రీట్‌లోని పుతీరం వెళ్లి కేవలం రూ.10ల్లోనే కచోరీ, ఆలూ దమ్‌ తినొచ్చు.

కాలేజ్ స్ట్రీట్‌లో ఉన్నప్పుడు, కొంచెం టీ తాగి, మిష్టి తినడానికి ఏదైనా స్వీట్ షాపుల్లోకి వెళ్లండి.

ఇండియన్ మ్యూజియంకు వెళ్లేందుకు రూ.10తో మెట్రోలో ప్రయాణించండి. ప్రవేశ రుసుము రూ. 20 మాత్రమే. కావలసినంత సమయం గడపవచ్చు.

కోల్‌కతాలోని ఐకానిక్ న్యూ మార్కెట్‌లో చాలా తక్కువ ధరలకు కొన్ని ఉపకరణాలు, దుస్తులను షాపింగ్ చేయండి

మెట్రోలో నందన్ వద్ద కోల్‌కతా సంస్కృతిని తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు కేవలం 30 రూపాయలకే సినిమా చూడొచ్చు

కోల్‌కతాలో భారతదేశంలో అత్యుత్తమ వీధి ఆహారాలు లభిస్తాయి. రూ. 50 లోపు రోడ్‌సైడ్ పలురకాలైన ఫుడ్ దొరుకుతుంది