దేవ్‌ మోహన్‌ స్వస్థలం కేరళలోని త్రిశ్శూర్‌. 1992 సెప్టెంబరు 18న జన్మించాడు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన దేవ్‌.. బెంగళూరులోని ఓ కార్పొరేట్‌ సంస్థలో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు.

దేవ్‌కు చిన్నప్పటి నుంచీ వ్యాయామం చేసే అలవాటు ఉండడంతో బెంగళూరులోనూ ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లేవాడు.

అలా జిమ్‌కు వెళ్తుండే దేవ్‌కు ఓ మోడల్‌ పరిచయమయ్యాడు.

ఫిజిక్‌ బాగుందని చెబుతూ మిస్టర్‌ ఇండియా పోటీల్లో పాల్గొనాలని దేవ్‌కు ఆ మోడల్‌ సలహా ఇచ్చాడు.

ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుందనుకున్న దేవ్‌ 2016లో ముంబయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు.

దేవ్‌ స్నేహితుడు ఓ నిర్మాణ సంస్థ కొత్త హీరోలను వెతుకుతోందని చెప్పి, అదృష్టం పరీక్షించుకోమన్నాడట.

మిత్రుడి మాటను కాదనలేక దేవ్‌ సంబంధిత ఆడిషన్‌కు వెళ్లాడు. ఆడిషన్‌ ఇచ్చిన కొన్నిరోజుల్లోనే సెలక్ట్‌ చేసినట్లు ఆయనకు శుభవార్త అందింది.

 తన తొలి సినిమా ‘సూఫియం సుజాతయుం’ ఓటీటీలో విడుదలవడంతో దేవ్‌కి నిరాశ ఎదురైనట్టైంది.

నా తొలి సినిమా సూఫియుం సుజాతయుం చూసిన నిర్మాత గుణ నీలిమ ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేశారు’ అని దేవ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.