శబరిమల పేరు చెబితేనే భక్తి భావం ఉప్పొంగిపొర్లుతుంది
శబరిమల అయ్యప్పస్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తారు
శబరిమలలో 18 మెట్లకు ప్రత్యేకత ఉంది
మొదట ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంకేతం. ఆ తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం
అనంతరం 3 మెట్లు సత్వం, తామసం, రాజషానికి సంకేతం. ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి
చివరి రెండు మెట్లు విద్య, అవిద్యకు సంకేతం. విద్య అంటే జ్ఞానం పొందడానికి, అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టడానికి సంకేతం
దీక్షను చేపట్టిన భక్తులు ఈ మెట్లను ఎక్కిన తర్వాత మొదటగా కనిపించేది ధ్వజస్తంభం
గతంలో పంచలోహాలతో కప్పబడిన రాతి ధ్వజస్తంభంగా కనబడేది
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడి విరాళంతో సంపూర్ణంగా స్వర్ణ ధ్వజస్తంభంగా మారింది