తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి సినిమాలో హీరోగా కనిపించారు ప్రభు. మొదటి సినిమాతోనే నటనపరంగా మెప్పించారు.
ప్రభు 1980-90 దశకంలో హీరో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం ఎక్కువగా సహాయ నటుడి పాత్రల్లో కనిపిస్తున్నారు.
కొద్ది రోజులుగా ప్రభు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మేడ్వే ఆసుపత్రిలో చేరారు.
ప్రభుకి లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టుగా డాక్టర్లు వెల్లడించారు.
మరోవైపు రెండు రోజుల్లో ఆయనని డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
ఇటీవల ప్రభు దళపతి విజయ్ వారసుడు చిత్రంలో కనింపించారు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.