ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటిలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే టక్కున చెప్పే 7/జి బృందావన్ కాలనీ
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది
ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు
ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీరిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది
2004లో విడుదలై మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించనున్నారు
అయితే విజయ్ దేవరకొండ ఈ సీక్వెల్ లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది
విజయ్ అయితేనే 7/జి బృందావన్ కాలనీ సీక్వెల్ కు సెట్ అవుతాడని అంటున్నారు కొందరు. మరి త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది
గతంలో అర్జున్ రెడ్డి లానే ఈ సినిమాకూడా విజయ్ నటిస్తే సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో