గతంలో ఎన్నో విజయవంతమైన ప్రగాలు చేసిన ఘనత శ్రీహరికోటకు ఉంది

ఇప్పుడు కూడా 'వన్‌వెబ్‌' సంస్థ ఇక్కడ భారీ ప్రయోగానికి సిద్ధంగా ఉంది

36 ఉపగ్రహాలను  ఒకేసారి నింగిలోకి పంపేందుకు గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ సంస్థ 'వన్‌వెబ్‌' రంగం సిద్ధచేస్తుంది

శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్‌-3 నుంచి వీటిని పంపనుంది

మార్చి తొలివారంలో ఈ ప్రయోగం జరగనుంది

36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్‌ అని వన్‌వెబ్‌ సంస్థ తమ ట్వీటర్ లో పేర్కొంది

గత అక్టోబర్‌ 22న శ్రీహరికోట నుంచి 36 శాటిలైట్లను నింగిలోకి పంపింది వన్‌వెబ్‌ సంస్థ

ఇప్పుడు కూడా కూడా అదే తరహా ప్రయోగానికి సిద్ధం అవుతుంది