వయసు పెరిగే కొద్ది మన ముఖం పై ముడతలు పడటం చాలా సహజం. కొందరికి అయితే.. ముఖం పై నల్లమచ్చల సమస్య కూడా వెంటాడుతుంది.

మనం పెరిగే వయసును తగ్గించలేం. కానీ.. కొంత కాలం పాటు ఆ వయసును కంట్రోల్‌ చేయవచ్చు.

పెరిగిన వయసు ముఖం పై కనపడకుండా జాగ్రత్తపడొచ్చు.ఇక ముఖం పై ముడతల విషయానికి వస్తే...

చర్మ సంరక్షణలో కొంచెం అదనపు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను కొంత వరకు నివారించవచ్చు. సరైన చర్మ సంరక్షణ అకాల ముడతలు, నల్ల మచ్చలను నివారిస్తుంది.

అలాంటి అద్భుతం ఆలివ్‌ ఆయిల్‌ తో సాధ్యమౌతుంది. రెండు టీస్పూన్ల టమోటా రసం, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి మీ ముఖం, మెడకు అప్లై చేయండి.

15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. టొమాటోలో పొటాషియం, విటమిన్‌ సి ఉంటాయి.టొమాటోలో 'లైకోపీన్‌' అనే సమ్మేళనం ఉంటుంది.

ఇది ఓపెన్‌ రంధ్రాలను తగ్గిస్తుంది. డార్క్‌ స్పాట్‌లను తగ్గించడంలో, ముడతలు తగ్గించడంలో సహాయపడవచ్చు.

అదేవిధంగా, సమాన పరిమాణంలో ఆలివ్‌ నూనె , నిమ్మరసం కలపండి. నిమ్మరసంలో విటమిన్‌ సి ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు పడకుండా చేస్తుంది.