భావోద్వేగాలు అనేవి అందరిలో ఉంటాయి. కోపం, బాధ, సంతోషం, ప్రేమ, భయం.. ఇవన్నీ మానసిక చర్యలు.

భావోద్వేగంగా ఉండటం ప్రతికూల లక్షణం కానప్పటికీ అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.

మీరు మీ భావోద్వేగాలు నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించినట్లయితే మీరు ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నారని గ్రహించాలి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనం కొన్ని పద్ధతులు పాటించాలి.

ప్రవర్తనా మార్పులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా భావోద్వేగ వ్యసనాన్ని నిర్ధారించడంలో వారు మీకు సహాయపడే అవకాశం ఉంది.

భావోద్వేగంతో ఇబ్బంది పడే వారికి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందువల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

చక్కెర, గ్లూటెన్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి. 

వీటి స్థానంలో మాంసం, కూరగాయలు, పండ్లు, నెయ్యి, గింజలు, గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.