చెన్న కేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి
ఈ ఆలయంలోని రక రకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది
ఈ ఆలయాన్ని మృదువైన సున్నపు రాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు
ఇక్కడ పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక శిల్పాలను చూడవచ్చును
ఆలయం ప్రవేశ ద్వారం వద్దే ఒక పుష్కరణిని (మెట్లబావి) ఉంటుంది
అలాగే ఇక్కడ వివిధ నర్తకిల శిల్పాలు రకారకాల భంగిమలలో ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి
ఆలయం అంతర్బాగంలో రాజగోపురాలు, చేన్నిగరాయ ఆలయం, లక్ష్మీ దేవి ఆలయం ఉంటాయి
ఆలయం బయట 42 అడుగుల ధ్వజస్తంబం ఒకవైపు నెలను తాకి ఉండదు. కేవలం మూడు వైపుల మాత్రమే ఆధారపడి ఉంటుంది