రమ్యకృష్ణ ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవస‌రం లేదు. ఇండియ‌న్ ఇండ‌స్ట్రీని త‌న అందాల‌తో.. అభిన‌యంతో ఆడుకుంది రమ్యకృష్ణ

కొన్నేళ్ల పాటు నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చ‌క్రం తిప్పింది. ఇండ‌స్ట్రీ ఏదైనా త‌న న‌ట‌న‌తో అంద‌రికీ పిచ్చెక్కించింది ఈ నీలాంబ‌రి.

సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించింది రమ్యకృష్ణ. ఈమె తమిళనాట ప్రముఖ పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు.

తన 13వ యేటనే నటిగా కెరీర్ ప్రారంభించింది రమ్యకృష్ణ. కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. 

1989లో కళాతపస్వీ కె.విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘సూత్రధారులు’తో నటిగా ఆమెకు మంచి మార్కులు పడ్డాయి.

1990లో వ‌చ్చిన "అల్లుడు గారు" సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. అక్క‌డ్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. 

1990 నుంచి 2000.. ఈ ప‌దేళ్ల గ్యాప్‌లో ఎన్నో సంచ‌ల‌న సినిమాలు చేసింది ర‌మ్య‌కృష్ణ‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇండ‌స్ట్రీల్లో త‌న‌దైన ముద్ర వేసింది.

ముఖ్యంగా ఆమె కెరీర్‌లో "నరసింహ" ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. రజినీకాంత్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో నీలాంబ‌రిగా చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌ర్ఫార్మెన్స్ చేసింది.

ముఖ్యంగా "బాహుబ‌లి"లోశివ‌గామి పాత్ర‌తో ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో మ‌రోసారి త‌న స‌త్తా చూపించింది. 

 హిందీలోను ‘ఖల్ నాయక్’, బడేమియా ఛోటే మియా’ సినిమాల్లో నటించి అక్కడ కూడా సత్తా చాటింది.