హీరోయిన్ స్నేహ తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
హీరోయిన్ సౌందర్య మరణం తరువాత ఆమె స్థానాన్ని కొంత వరకు భర్తీ చేసిన హీరోయిన్ స్నేహ.
ఆమె తెలుగులో స్టార్ హీరోల చిత్రాలలో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకున్నారు
స్నేహ తమిళ నటుడు ప్రసన్న ను పెళ్లి చేసుకుంది. ఈ జంటకి పాప మరియు బాబు ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అలాగే తాను చిన్నతనంలో తాను అనుభవించిన బాధల గురించి చెప్పుకొచ్చారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తన తల్లిదండ్రులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అని అన్నారు.
కుమార్తెలలో తాను చివరి దానినని, తన బామ్మ తనకు బదులు కుమారుడు పుట్టాలని కోరుకుందని తెలిపింది.
కూతురు పుట్టేసారికి ఆమె తన ముఖాన్ని 3 రోజుల వరకు చూడడానికి కూడా ఇష్టపడలేదని స్నేహా చెప్పుకొచ్చింది.
బాల్యంలో తాగే నీళ్లు పక్కనే ఉన్నా సోదరులకు తానే ఇచ్చేదాని అదేంటి అని అడిగితే మేము మగవాళ్ళం ఆడపిల్ల ఇంటి పని చేయాలి అనేవారు.
తన పెద్ద అన్నయ్య ముఖ్యంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేసేవాడని, పనులు అన్ని తననే చేయమని ఆర్డర్ వేసేవాడని స్నేహ వెల్లడించారు.