INDW vs AUSW: ఛేజింగ్‌లో మంధాన దిబెస్ట్.. టీ20ల్లో సరికొత్త రికార్డ్..

INDW vs AUSW:  మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఉంది.

ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది.

సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన సరికొత్త రికార్డు సృష్టించింది.

ఓపెనర్ స్మృతి మంధాన 49 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది.

ఈ ఇన్నింగ్స్‌తో  టీ20ఐలో ఛేజింగ్‌లో అత్యధిక సార్లు అంటే 12 సార్లు 50+ మార్క్‌ను దాటిన ప్లేయర్‌గా నిలిచింది.

స్మృతి మంధానకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ స్టెఫానీ టేలర్ పేరిట ఉంది.

ఆమె టీ20 క్రికెట్‌లో పరుగులను ఛేజింగ్ చేస్తున్నప్పుడు 11 సార్లు 50 మార్క్‌ను దాటింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సారా టేలర్ టీ20లో ఛేజింగ్ చేస్తున్నప్పుడు 10 సార్లు 50 మార్కును దాటింది.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సుజీ బేట్స్ 9 సార్లు 50+ దాటింది.

న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ 8 సార్లతో ఈ లిస్టులో చేరింది.