రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది.

 తీపి పదార్ధాలు మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణశక్తి మందగిస్తుంది.

కళ్ళ అలసట తగ్గాలంటే దోస లేదా బంగాళాదుంప చక్రాలను కళ్ళపై పెట్టుకోవాలి.

తోటకూర రోజు ఆహారంలో చేరిస్తే మలబద్దక సమస్య ఉండదు.

రాత్రి పూట ధనియాలు నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది.

ఆహారం తినేటప్పుడు నీరు ఎక్కువ తాగితే అరుగుదల ఉండదు.

తెల్లవారు జామున నిద్రలేవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

హారతి కర్పూరం, గంధం కలిపి తలకు రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.