అస్తవ్యస్త జీవన శైలి కారణంగా మనలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారనేది కాదనలేని సత్యం
కనీసం రోజు ఏడుగంటల పాటైన నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
కొన్ని రకాల నూనెలు కంటి నిండా నిద్రపట్టేలా చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు
నిద్రపోయే ముందు రెండు చుక్కలు సంపెంగ నూనె వేసిన గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలు.. నిద్ర ముంచుకొస్తుంది
చిన్న గిన్నెలో నాలుగైదు చుక్కల లావెండర్ నూనె వేసి బెడ్ పక్కన ఉంచితే చాలు. మెదడుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడి, ఆందోళన దూరమయ్యేలా చేస్తుంది
బెంజోన్ ఎస్సెన్షియల్ ఆయిల్‌లో ముంచిన దూది ఉండను పడుకునే ముందు వాసన చూస్తే కమ్మని నిద్ర ఇట్టే పట్టేస్తుంది
రక్తపోటుతో బాధపడేవారు గంధంనూనెను ఒక గిన్నెలో వేసి బెడ్ రూంలో ఉంచితే చాలు హాయిగా నిద్ర పోతారు.