మహేశ్ బాబు, అల్లు అర్జున్‌ల బాటలో శివకార్తికేయన్
కోలీవుడ్‌లో తక్కువకాలంలోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శివకార్తికేయన్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన డాన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
కోలీవుడ్‌లో తక్కువకాలంలోనే స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శివకార్తికేయన్.
ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన డాన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
అయితే తెలుగులోనూ అభిమానులను సంపాదించుకోవాలన్న ఆశతో నటించిన ప్రిన్స్ చిత్రం నిరాశనే మిగిల్చింది.
ప్రస్తుతం అతడు హీరోగా నటించిన మావీరన్ చిత్రం జూలై 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
ఈ మధ్య నటీనటులు, దర్శకులు ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు.
దర్శకుడు అమీర్ ఇటీవలే ఒక కాఫీ షాపును ప్రారంభించారు.
నయనతార, ప్రియ భవానీ శంకర్ వంటి వారు కూడా ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
తాజాగా శివకార్తికేయన్ కూడా ఇతర వ్యాపారంలోకి దిగుతున్నట్టు తాజా సమాచారం.
ఈయన ఒక మల్టీ ఫ్లెక్స్ థియేటర్‌కు భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఏషియన్ గ్రూప్ సంస్థతో కలిసి చైన్నెలో ఒక మల్టీఫ్లెక్స్ థియేటర్ ప్రారంభించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.