టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

తాజాగా సితార తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. 

 బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ పంపిన దుస్తులను పోస్ట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. 

ఆలియా భట్ గతంలో కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌ కుమారులకు దుస్తులు పంపి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

తాజాగా మరోసారి మహేశ్- నమ్రతల గారాలపట్టి సితారకు దుస్తులు పంపింది. 

మీ కుటుంబంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.. మీ అందరి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.