తాత మరణంతో తీవ్ర భావోద్వాగానికి లోనైంది మహేశ్ బాబు కూతురు సితార.
తాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఆమె పోస్టింగ్.. ఆమె మాటల్లో చూస్తే.. ప్రతీ రోజు చేసే భోజనం ఒకేలా ఉండదు.
మీ దగ్గర నేను చాలా విలువలు నేర్చుకున్నాను. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి.
ఆ జ్ఞాపకాలన్నీ మరిచిపోలేను. నాకు నువ్వే అసలైన హీరో. మీరు గర్వపడేలా నేను తయారవుతాను.
మీరు లేకపోవడం నాకు తీరని లోటు అంటూ ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది సితార.