‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’.. అనే ట్యాగ్‌లైన్‌ తెరకెక్కిన సీతారామం ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది.

విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. 

ఈ ఫుల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ బాక్సాఫీస్‌ ముందు రికార్డు కలెక్షన్లను రాబడుతోంది.

పాజటివ్‌ టాక్‌ రావడంతో సినిమా కలెక్షన్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

ఇక రానున్న రోజుల్లో సెలువులు ఉండడంతో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.