మృణాల్ ఠాకూర్.. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్

దుల్కర్ హీరోగా నటించిన సీతరామం ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమాలో సీతామహాలక్ష్మీ‌గా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా మృణాల్ తన నటనతో ఫిదా చేశారు.

అది అలా ఉంటే మృణాల్‌ తాజాగా ఓ ఇంటర్వూలో తన పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టెంగ్ కామెంట్స్ చేసింది.

ఆమె పెళ్లి విషయంలో స్పందిస్తూ.. సమాజంలో ప్రతి మహిళను ఇలాంటి ఒక ప్రశ్న వెంటాడుతోనే ఉంటుంది. మహిళ పెళ్లి, ప్రేమ, పిల్లలు వాటిపైనే సమాజం ఆసక్తి చూపిస్తుంది.

 నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయి.. అలాంటి లైఫ్‌ను అర్ధం చేసుకొనివాడినే నేను వివాహం చేసుకుంటానని తెలపింది.

 అంతేకాదు ఈ సందర్భంగా పిల్లలపై కూడా మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే.. నాకు పెళ్లి కన్నా ముందు పిల్లల్ని కనాలని ఉంది.

ఎందుకో నాకు ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదంటూ పేర్కోంది.