ఉమ్రాన్, అర్ష్‌దీప్, సిరాజ్‌లలో ఒక్కరికే ఛాన్స్.. లంకతో తొలి వన్డేకు భారత ప్లేయింగ్ 11

భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది.

ఈ సిరీస్ ద్వారా, భారత ఇద్దరు స్టార్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తిరిగి మైదానంలోకి రానున్నారు.

ఈ ఇద్దరు ఆటగాళ్లు నేరుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోవడం ఖాయమే.

బుమ్రా, షమీ గత ఏడాది ఎక్కువ కాలం గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేకపోయారు.

ఈ సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన చేశారు.

అయితే ఇప్పుడు షమీ, బుమ్రా పునరాగమనం కారణంగా ప్లేయింగ్ 11లో ఈ ముగ్గురూ కలిసి ఆడడం సాధ్యం కాదు.

దీంతో సిరాజ్, అర్ష్‌దీప్, ఉమ్రాన్‌లలో ఇద్దరు ఆటగాళ్లు శ్రీలంకతో జరిగే మొదటి వన్డే నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

అయితే, ఉమ్రాన్, అర్ష్‌దీప్‌లకు బదులుగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో మహ్మద్ సిరాజ్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

గత ఏడాది వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు.

అర్ష్‌దీప్ సింగ్ టీ20లో మెరుగ్గా రాణించినప్పటికీ, వన్డేల్లో ఇంకా నిరూపించుకోలేకపోయాడు.

సుమారు 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కోసం కలిసి ఆడనున్నారు.

గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కలిసి టీమ్ ఇండియా తరపున ఆడారు.

ఆ తర్వాత గాయం కారణంగా బుమ్రా టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోయారు.