జానపదాలు, తెలుగు సినిమా పాటలు, స్పెషల్‌ సాంగ్స్‌.. ఇలా ఏవైనా తన తీయనైన గొంతుతో పాటకు ప్రాణం పోస్తుంది ప్రముఖ సింగర్‌ మంగ్లీ.

అందుకే ఆమె పాటలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఇటీవల విక్రాంత్‌ రోణ లోని రక్కమ్మ పాటతో దక్షిణాదిన కూడా క్రేజ్‌ సంపాదించుకుంది.

ఈనేపథ్యంలో కన్నడలో మంగ్లీకున్న పాపులారిటీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది

కాగా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అద్భుతమైన పాటలతో ఆకట్టుకునే మంగ్లీ బతుకమ్మ ఉత్సవాల కోసం కూడా ప్రత్యేక పాటను రూపొందించింది.

అయితే ఈ ఏడాది ఉత్సవాల్లో ఆమె పాడిన ఓ పాట కాంట్రవర్సీగా మారింది. అమ్మవారిపై వాడిన పదాలు వివాదానికి దారి తీశాయి. 

మంగ్లీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే

ఎవరో రాసిన పాటకు ఆమె ఎలా క్షమాపణ చెబుతుందంటూ చాలామంది మంగ్లీకి మద్దతుగా నిలిచారు.