సింగర్ కౌసల్య అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దర్శకత్వంలో అనేక పాటలు పాడారు ఆమె
1999లో తొలిసారిగా నీ కోసం సినిమాలో పాడారు కౌసల్య. దాదాపు 350కి పాటలను తెలుగులో ఆలపించారు ఆమె
కాగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె జీవితం ఒడిదుడికుల మధ్య సాగింది
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ' వైవాహిక జీవితంలో చాలా బాధలు అనుభవించాను
నా బాబు చాలా చిన్న పిల్లవాడు కావడంతో భరించి నా భర్త మరో పెళ్లి చేసుకోవాలనుకునే వరకు సర్దుకు పోదామని ఓపికగా ప్రయత్నించాను
కానీ చివరికీ ఆయన మరొకరిని పెళ్లి చేసుకుని విడిపోయారు.' అని ఆమె తెలిపారు
తర్వాత ఆమె తన కొడుకు గురించి మాట్లాడుతూ.' ప్రస్తుతం బాబు పెద్దవాడు అయ్యాడు. వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది
కానీ వాడేమో నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు. నా జీవితంలో సంతోషం చూడాలన్నదే వాడి కోరిక
ఇప్పుడు నా కొడుకే లోకం.. నా పాటకి మంచి గుర్తింపు వస్తే ముందుగా సంతోషపడేది బాబే.' అని తెలిపారు కౌసల్య