క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా క్రానిక్ కిడ్నీ సమస్యను నివారిస్తుంది
ఒక రోజులో కనీసం 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల వరకు నీరు తీసుకోవడం ఉత్తమం. అలాగే కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది
మధుమేహం, గుండె జబ్బులు, అధిక కలెస్ట్రాల్ వంటి ఇతర సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే విధంగా చూసుకోవాలి. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది
పెయిన్ కిల్లర్స్ మందులని తలనొప్పి లేదా ఆర్థరైటిస్ కోసం క్రమం తప్పకుండా తీసుకుంటే మూత్ర పిండాలు దెబ్బతింటాయని నిపుణులు సూచిస్తున్నారు
ధూమపానం అలవాటు ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది. ధూమపానం కారణంగా కిడ్నీల సమస్యతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే