మీ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా.?
మీ లైఫ్ పార్టనర్ మీకు తెలియకుండా ఇంకొకరితో అఫైర్ పెట్టుకున్నారా.? సంకేతాలు ఇవే..
తన మొబైల్ ఫోన్ దాచిపెట్టడం: ఎప్పుడైతే.. మీ పార్టనర్ మీ నుంచి అతడి ఫోన్ దాచిపెడుతున్నాడో.. అప్పుడు ఏదో సీక్రెట్ దాస్తున్నాడని లెక్క. ఏదో గూడుపుఠాణీ జరుగుతున్నట్లే.
ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయకపోవడం మీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మీ పార్టనర్ ఆన్సర్ చేయకపోయినా.. 'పనిలో ఉన్నా' నీతో తర్వాత మాట్లాడతా.. అంటూ చెప్పినా.. మిమ్మల్ని ఎవాయిడ్ చేస్తున్నారన్న మాటే..
సెక్స్ లైఫ్‌లో మార్పులు.. ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడు.. మిమ్మల్ని దూరం పెడుతుంటే.. అతడు ఏదో సీక్రెట్ దాస్తున్నట్లే.
అతిగా ప్రవర్తించడం.. తప్పు చేయనివాడు ఎప్పుడూ భయపడడు. మీరు అడిగిన ప్రశ్నలకు మీ పార్టనర్ కంగారుపడుతూ జవాబిస్తే.. ఏదో దాస్తున్నాడన్నట్లు లెక్క.
తరచూ అబద్దాలు.. ఎఫైర్ సాగిస్తున్నట్లయితే.. ప్రతీ విషయంలోనూ మీ భాగస్వామి నోటి నుంచి అబద్దం మాత్రమే వస్తుంది. అంశం ఏదైనా కూడా దాన్ని దాటవేయడానికి చూస్తాడు.
సడన్ సర్‌ప్రైజ్‌లు.. ఎప్పుడూ లేనట్టుగా మీ పార్టనర్ మీకు సడన్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారా? కచ్చితంగా అనుమానపడాల్సిందే. మీ జీవనశైలికి విరుద్దంగా ఆ గిఫ్ట్స్ ఉంటే.. అది వేరొకరికి తీసుకున్నవి అని అర్ధం