సినీ పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనున్నారు.

కొద్దికాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మూడు మూళ్లు బంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం.

వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి అంగరంగా వైభవంగా ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హజరు కానున్నారని..

ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం కియారా అద్వానీ.. డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది.