పండ్లలో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు
మనలో చాలామంది కూడా బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లను తింటుంటారు
అయితే కొంతమందికి మాత్రం పండ్లను జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు. ఇలా తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఎనర్జీ వస్తుందని అనుకుంటారు
ఉదయాన్నే మనం తీసుకునే ఆహరం.. పౌష్టికాహారం అయ్యి ఉండాలి. ఎందుకంటే అది ఆ రోజు మొత్తం మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది
కొంతమందికి ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగడం అలవాటు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు అంటున్నారు
ఉదయం ఖాళీ కడుపుతో చల్లటి ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా.. మలబద్దకం, ఎసిడిటీ లాంటి కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం వేళ ఫ్రూట్ జ్యూస్‌లకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు
ఒకవేళ పొరపాటున ఉదయాన్నే జ్యూస్ తాగితే.. ఆ తర్వాత గంట వరకు ఏమి తినకూడదు