నెయిల్ పాలిష్ లోని హైడ్రోక్వినాన్ అనే రసాయం కంటికి తగిలితే కార్నియో దెబ్బతింటుంది

దీనిని పీల్చుకోవడం వలన ముక్కు, గొంతు, ఎగువ శ్యాసనాళంలో కూడా చికాకు ఏర్పడుతుంది

నెయిల్ పాలిష్ లో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ రసాయనం మైలోయిడ్ లుకేమియాకు కారణమవుతుంది

ఇందులో అక్రిలేట్స్ అనే రసాయనం కూడా ఉంటుంది. దీనిని తాకితే చర్మంపై అనేక సమస్యలు కలుగుతాయి

కార్బన్ బ్లాక్ అనే పౌడర్ నెయిల్ పాలిష్ తయారీలో ఉపయోగిస్తారు. దీని వలన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది

నెయిల్ పాలిష్ రాసుకున్న తర్వాత త్వరగా ఆరిపోయేల చేయాలని ఇందులో టోలుయెన్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు

ఎన్సీబీఐలో అందుబాటులో ఉన్న పరిశోధన ప్రకారం ఈ రసాయనం నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది