చాలా మంది ఉదయం సమయం లేకో, ఓపిక లేకో బ్రేక్‌ ఫాస్ట్‌ను స్కిప్‌ చేస్తుంటారు. ఈ స్థానంలో రస్క్‌, టోస్ట్‌లను తింటుంటారు.

టీలో వీటిని ముంచుకొని తినేవారి సంఖ్య ఎక్కువేనని చెప్పాలి. ఇన్‌స్టాంట్‌గా దొరుకుతాయి, రుచి బాగా ఉంటుందని ఒకటి రెండు ఎక్కువగానే లాగించేస్తుంటారు.

అయితే రుచికి బాగున్న ఆరోగ్యానికి మాత్రం ఇది చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు.

రస్క్‌ తినడం వల్ల అధిక బీపీ, బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్య సమసస్యలు తలెత్తుతాయి. ఇవి కాలక్రమేణ గుండె సమస్యలకు దారి తీస్తాయ్

రస్క్‌ తినడం వల్ల అధిక బీపీ, బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్య సమసస్యలు తలెత్తుతాయి. ఇవి కాలక్రమేణ గుండె సమస్యలకు దారి తీస్తాయ్

చాలా వరకు రస్క్‌లు మైదా పిండితోనే తయారు చేస్తారు. దీని కారణంగా జీర్ణం అంత సులభంగా అవ్వదు. ఇది జీర్ణ క్రియపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బరువు కూడా పెరుగుతారు.

టీ, రస్క్‌ కలిపి తినడం వల్ల పేగుల్లో అల్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియలో వేగం తగ్గడం, మలబద్ధకంతో పాటు గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.