వేసవిలో ప్రజలు శరీరానికి మేలు చేసే వివిధ జావలు, జ్యూస్‌లు సేవించడంపై దృష్టి పెడతారు.
వేసవిలో ముఖ్యంగా కర్బూజా జ్యూస్ సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే కర్బూజా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పాలతో కర్బూజా కలిపి తీసుకుంటే అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయి.
సాధారణంగా బయట ఎక్కడైనా మనం కర్బూజా జ్యూస్ తాగితే కచ్చితంగా కర్బూజాతో పాటు పాలతో కలిపి చేసి ఇస్తారు.
అయితే ప్రతి ఆహారం దాని సొంత రుచిని కలిగి ఉంటుంది. అలాగే జీర్ణక్రియ తర్వాత ప్రభావాలను కలిగి ఉంటుంది.
విభిన్నమైన రుచులను కలిగిన ఆహారపదార్థాలు కలిపితే, జీర్ణక్రియ అసమతుల్యతకు దారితీస్తుంది.
పేలవమైన ఆహార కలయికలు కూడా అజీర్ణంతో పాటు శరీరంలో గ్యాస్ సమస్య ఏర్పడటానికి కారణమవుతాయి.
సాధారణంగా పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అయితే కర్బూజా మాత్రం త్వరగా జీర్ణం అయ్యిపోతుంది.
కాబట్టి వాటిని కలపడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు.
అలాగే మీకు రోజంతా అసౌకర్యంగా లేదా అలసటగా కూడా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.