మాయదారి కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ సమయంలో యాంటీ బయోటిక్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది

చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా కరోనా లక్షణాలు వచ్చాయేమోనన్న భయంతో ప్రజలు యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా తీసుకున్నారు

ఇప్పటిదాకా కరోనా వైరస్‌పై యాంటీ బయోటిక్స్ ఎలాంటి ప్రభావం చూపించలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఒకరు తెలిపారు

యాంటీ బయోటిక్స్ అధికంగా తీసుకోవడం వల్ల ”సూపర్ గనేరియా’ అనే చికిత్స లేని వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది

యాంటీ బయోటిక్‌లను అధిక శాతంలో వాడటం వల్ల ఎక్కువగా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తోంది

‘సూపర్ గనేరియా’ అనే లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్ ప్రబలే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు

ఈ వ్యాధికి చికిత్స లేదని.. కాబట్టి యాంటీ బయోటిక్స్‌ను అవసరమైతే తప్ప తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు