చాలా మంది మహిళలు మేకప్ వేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు

కంటికి కాటుకను కూడా పెట్టుకుంటారు. కాటుక.. ఆ కళ్లకు మరింత అందాన్నిస్తాయి

ప్రస్తుత కాలంలో అనేక రకాల కాటుకలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి

వాటిలో అధిక స్థాయిలో రసాయనాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

కాటుక తయారీ కోసం పాదరసం, లెడ్, పారాబెన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు

కాటుకను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కంటి అలర్జీ, కార్నియల్ అల్సర్‌లు, కళ్లు ఎర్రబడటం వంటివి రావచ్చు

కాటుక వినియోగం అతిగా ఉంటే.. కళ్లలోపల వాపు వచ్చే ప్రమాదం ఉంది

కాటుకను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చని, అలా ఇంట్లో తయారు చేసిన కాటుకను వినియోగించడం ద్వారా ఎలాంటి హానీ జరుగదని నిపుణులు చెబుతున్నారు