మీ శరీరంలో విటమిన్ డి అధిక మోతాదులో ఉన్నట్లయితే ఇబ్బందులకు గురవుతారు.

ఈ క్రమంలో మీకు వాంతులు, వీరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో.. విటమిన్ డి విషయంలో కూడా అంతే.

మీరు పరిమితికి మించి విటమిన్ డి తీసుకుంటే మానసిక వ్యాధులను ఎదుర్కొవలసి ఉంటుంది.

విటమిన్ డి అధికంగా తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి, విసుగు, విరక్తి, ఇంకా తలనొప్పి వంటి వాటిని కూడా ఎదుర్కొంటారు.

విటమిన్ డి తీసుకోవడం కోసం ఇష్టానుసారంగా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వారికి తెలియకుండానే శరీరంలో దాని మోతాదు పెరుగుతుంది.

ఫలితంగా ఆకలి తగ్గినట్లు చాలా మందికి అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వీటికి బదులుగా మీరు సూర్యకాంతి వంటి సహజ పద్ధతుల ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.