ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్‌వెజ్ ఉండాల్సిందే

మటన్ లేదా చికెన్‌ లాగించేయాల్సిందే.. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి కొన్ని పోషకాలు లభిస్తాయి

కానీ అతిగా తింటే మాత్రం చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా కానీ అతిగా తింటే నష్టమే కానీ లాభం ఉండదు

మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది

మాంసాహారం ఎక్కువగా తినేవారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది

మాంసాహారాన్ని తప్పుడు పద్ధతిలో తీసుకుంటే బరువు పెరుగుతారని పలు పరిశోధనలో వెల్లడైంది

మాంసం తీసుకోవడం వల్ల కొన్నిసార్లు పేగుల పనితీరుపై చెడు ప్రభావం చూపుతుంది

ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదం. దీని వల్ల పొట్టకు సంబంధించిన అనేక వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తాయి