ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.
రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు.
దీనివల్ల శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినవద్దని సూచిస్తున్నారు.
గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
గుడ్లను అధికంగా తీసుకుంటే మలబద్దకానికి దారితీస్తుంది.
గుడ్లు ఎక్కువగా కడుపులో చికాకు పుడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ను కూడా ఎదుర్కొంటారు.
గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. ఇది కొవ్వును పెంచుతుంది.
అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు గుడ్లను తక్కువ మొత్తంలో తినాలి.