వంట గదిలో ఉండే మసాలా దినుసులు మన ఆరోగ్యాన్ని అందించే వాటిలో దాల్చిన చెక్క కూడా ఒకటి.
అయితే ఏదైనా పరిమితిని దాటితే విషంగా మారినట్లే దాల్చిన చెక్క కూడా మోతాదుకు మించితే ఆరోగ్యానికి హానికరం.
మోతాదుకు మించి దాల్చిన చెక్కను తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.
దాల్చిన చెక్కను అధికంగా తీసుకుంటే ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్‌లకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
దాల్చిన చెక్కను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది.
అలాగే రక్తపోటు కూడా తీవ్రంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మీకు మైకం, మత్తుగా అనిపిస్తుంది.
గ్యాస్ సమస్య, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్కను అతిగా వినియోగించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
పరిమితి దాటితే దాల్చిన చెక్క కాలేయం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
అధిక దాల్చిన చెక్క లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపి దాని పనితీరును కూడా నెమ్మదింపజేస్తుంది.
అందుకే ఈ దాల్చిన చెక్కని మోతాదుకు మించి తినకూడదు.