చాయ్‌, బిస్కెట్‌ ఈ రెండింటి కాంబినేషన్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు

ఉదయం, సాయత్రం అంటూ తేడా లేకుండా టీలో ఎంచక్కా బిస్కట్లను ముంచుకొని తింటుంటారు

చాయ్, బిస్కెట్‌లను కలిపి ఎక్కువ కాలం తీసుకుంటే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు

ఇంతకీ వీటి వల్ల కలిగే నష్టం ఏంటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న వివరాల్లోకి వెళితే

టీలో కలిపి తీసుకోవడం వల్ల తెలియకుండానే ఎక్కువగా బిస్కెట్స్‌ తింటుంటారు. దీంతో దీర్ఘకాలం బిస్కెట్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

టీతో పాటు తియ్యగా ఉండే బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

బిస్కెట్స్‌ను ఎక్కువగా రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. వీటిలో ఫైబర్‌ కంటెంట్‌ ఉండదు. దీంతో మోతాదుకు మించి బిస్కెట్స్‌ తింటే మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది

విపరీతంగా బిస్కెట్స్‌ టీ కలిపి తీసుకోవడం వల్ల దంతాలకుండే ఎనామిల్‌ దెబ్బ తింటుంది