చాలా మంది లంచ్‌ కంటే డిన్నర్‌లో బిర్యానీ ఎక్కువగా తింటారు. అయితే రాత్రిపూట బిర్యానీ తింటే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు

బిర్యానీ మేం ఎక్కువగానే తింటున్నాం. అయినా మాకేం కాలేదు అనేవారు చాలా మందే ఉన్నారు

తిన్నప్పుడే ప్రభావం చూపకపోవచ్చు కానీ.. భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

బిర్యానీ రోజుకు ఒకసారో లేకపోతే రెండు రోజులకో తినడం అస్సలు మంచిది కాదు. అంతగా తినాలనుకుంటే వారానికి ఒకసారి మాత్రమే తినండి

బిర్యానీ కలర్ ఫుల్‌గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్‌ను ఉపయోగిస్తారు. ఈ రంగులు నిషేధించారు

ఈ ఆర్టిఫిషియల్ కలర్లలో టర్ ట్రాజెన్ ఒకటి. ఇది నీళ్లలో చాలా తొందరగా కరుగుతుంది. బిర్యానీ అంతా రెడీ అయ్యాక ఈ రంగును జల్లుతారు

ఈ రంగు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రమాదకరమైన రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

దీని వల్ల క్యాన్సర్, ఆస్తమా, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది