చాలా మంది వానాకాలం, చలికాలంలో ఎక్కువగా టీ తాగుతుంటారు.
పేపర్, ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదంట
ప్లాస్టిక్ కప్పుల్లో వేడి టీ తాగడంతో అందులో ఉండే కెమికల్ శరీరంలోకి వెళ్తుంది. దీనితో డయేరియా వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం వల్ల కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉందంట. ఇందులో ఉండే కెమికల్స్ కిడ్నీ పని తీరుపై ప్రభావాన్ని చూపుతాయట.
ప్లాస్టిక్ కప్పుల్లో గర్భిణులు టీ తాగడం వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం వల్ల అందులో హానికరమైన కాడ్మియం, క్రోమియం కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయి.
అలాగే ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. అందుకే ప్లాస్టిక్ కప్పులో టీ తాగరాదు.
ప్లాస్టిక్ కప్పులో టీ తాగడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ పై ప్రభావం చూపుతుంది.
అలాగే ప్లాస్టిక్ కప్పులో టీ తాగడంతో క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.