చల్లటి నీరు తాగడం వల్ల మన శరీరం అసమతుల్యత చెందుతుందని చాలా మంది వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మీ రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే వేసవి కాలంలో చల్లగా ఉండే నీరు తాగడం కంటే.. గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత నీరు తాగడం ఉత్తమం.

చల్లటి నీరు తాగిన తరువాత, ఆహారం శరీరం గుండా వెళుతున్నప్పుడు చాలా గట్టిగా మారడం వల్ల పేగులు కుచించుకుపోయి ఎసిడిటీ సమస్య మొదలవుతుంది.

మీరు చల్లటి నీటిని ఎక్కువగా తాగితే ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడి మలబద్ధకంతో పాటు కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు కూడా రావచ్చు.

చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల సైనస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చల్లని నీరు తాగడం వల్ల వాగస్ నాడి దెబ్బతినడం వల్ల గుండె వేగం తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు రావచ్చు.

చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు.

ఊబకాయం సమస్య రాకుండా ఉండాలంటే చల్లటి నీరు తాగడం మానుకోవాలి.