వేసవిలో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు.

అందులో కోల్డ్ కాఫీ ఒకటి. వేసవిలో చాలామంది ఎక్కువగా కోల్డ్ కాఫీ తాగుతారు.

అయితే ఈ కోల్డ్ కాఫీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కోల్డ్‌ కాఫీని రుచికరంగా చేయడానికి ఇందులో మోతాదుకు మించి చక్కెరను ఉపయోగిస్తారు.

కోల్డ్ కాఫీని అధికంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఇది క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.

ఇక కోల్డ్ కాఫీలోని కెఫిన్ నిద్రపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇది క్రమంగా పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ముఖ్యంగా ప్రతిరోజూ చాలా కోల్డ్ కాఫీ తాగితే ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

అలాగే తలనొప్పి, మైకం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అలాగే త్వరగా అలసిపోతారు.

కోల్డ్‌ కాఫీని తీసుకోవడం వలన వారి రోగ నిరోధక శక్తి ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

రోజుకు 400 మిల్లీ గ్రాములకు మించి తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి.