తరచుగా నైట్ షిఫ్ట్‌లో పనిచేసే వ్యక్తులు లేదా రాత్రి మేల్కొని చదువుకునే విద్యార్థులు అర్థరాత్రి వరకు కాఫీ తాగుతారు.
ఇలా చేయడం వల్ల మీకు హాని కలుగుతుంది.
కాఫీలో కెఫిన్ పుష్కలంగా ఉంటుంది.. తాగిన వెంటనే మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.
కానీ మీరు రాత్రిపూట తాగితే, మీ నిద్ర బాగా ప్రభావితం అవుతుంది. మీరు బాగా నిద్రపోలేరు.
అదే సమయంలో, రాత్రిపూట కాఫీ తాగడం వల్ల కడుపు సమస్యలు కూడా వస్తాయి.
మీరు గ్యాస్, అసిడిటీ వల్ల ఇబ్బంది పడవచ్చు.
రాత్రి షిప్టుల్లో పనిచేసేవారు సాయంత్రం ఒక కాఫీ తాగితే చాలు, రాత్రి నిద్రరాకుండా పనిచేసుకోగలరు.
రాత్రిపూట నిద్ర సరిగా పట్టక పోవడం వల్ల, కొన్నాళ్లకు అది ఇన్సోమ్నియాగా మారిపోతుంది.
కాఫీ నిద్ర షెడ్యూల్ మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తుంది.
కాబట్టి రాత్రిపూట కాఫీ ఎప్పుడు తాగకండి.