చాలా మంది ఉదయం లేచిన వెంటనే రిఫ్రెష్‌గా ఉండటానికి టీ తాగుతుంటారు. దీనిని సాధారణంగా అందరూ బెడ్ టీ అంటూ ఉంటారు
టీతో రోజును ప్రారంభించే ఆచారం మన దేశంలో చాలా పురాతనమైనది. ఇది చాలా మందికి అలవాటుగా మారింది
అయితే ఖాళీ కడుపుతో (పరగడుపుతో) టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎప్పుడూ బెడ్ టీని తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ శరీరంలో కరిగిపోయిన వెంటనే రక్తపోటును పెంచుతుంది
టీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను క్షణాల్లో దూరం చేస్తుంది. అయితే ఇది ఉద్రిక్తతను మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణక్రియకు మంచిది కాదు. ఎందుకంటే ఇది కడుపులో గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది
ఉదయం ఖాళీ కడుపుతో చక్కెరతో చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది
పరగడుపుతో టీ తాగితే.. ఉదరం లోపలి భాగంలో అల్సర్ ఏర్పడే అవకాశం ఉంది